TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫ్యాన్స్ పవన్ మాట కూడా వినట్లేదు

Published on: Wed Jun 27, 2018 5:57PM


పవన్ కళ్యాణ్.. చేసింది తక్కువ సినిమాలే అయినా యూత్ లో విపరీతమైన క్రేజ్.. 2014 లో జనసేన పార్టీ స్థాపించిన పవన్, ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టారు.. ఇంతవరకు బాగానే ఉంది, కానీ కొందరు పవన్ ఫ్యాన్స్ తోనే అసలు చిక్కు.. మొదటినుండి పవన్ ఫ్యాన్స్ గురించి 'మితిమీరిన అభిమానం, ఆవేశం' అనే అభిప్రాయం ఉంది.. చాలా సందర్భాల్లో ఇది నిజమని రుజువైంది కూడా.. పవన్ ని ఎవరైనా ఏదైనా అంటే వారిని బెదిరించడం చూసాం.. సినిమా హీరోని, రాజకీయ నాయకుడిని విభేదించే వాళ్ళు ఉంటారు అది కామన్.. అది తెలుసుకోకుండా మా దేవుడిని అంటే ఊరుకోము అని బెదిరించడం తప్పని చాలామంది చెప్పారు.. అయినా కొందరు ఫ్యాన్స్ వినలేదు.. ఇక కొందరైతే పవన్ చెప్తే తప్ప ఈ ఫ్యాన్స్ వినరేమో అనుకున్నారు.

కానీ కొందరు ఫ్యాన్స్ పవన్ చెప్పినా వినట్లేదు.. దానికి ఉదాహరణే రేణూ దేశాయ్ రెండో పెళ్లి అంశం.. పవన్ మాజీ భార్య రేణూ, రెండో పెళ్లి చేసుకుంటున్నారు.. రేణూ, తన నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేసారు.. ఈ విషయం మీద చాలామంది పవన్ ఫ్యాన్స్ పాజిటివ్ గానే స్పదించారు.. కానీ కొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు.. దీంతో పవన్ రంగంలోకి దిగి 'రేణూ దేశాయ్ గారికి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేసారు.. దీంతో రేణూకి బెదిరింపులు ఆగిపోతాయని అందరూ అనుకున్నారు.. అయినా ఆ కొందరు ఆగలేదు.. రేణూని అలానే బెదిరించారు.. దీంతో ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నే తీసేసారు.. అభిమానించే వ్యక్తి పేరుని నిలబెట్టాల్సింది పోయి ఇలా అభిమానం పేరుతో ఆయన పేరుకి మచ్చ తెస్తున్నారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇక కొందరైతే పవన్, అభిమానుల్ని నమ్ముకొని ప్రజలకి సేవ చేస్తానంటూ జనసేన పెట్టారు, కానీ అభిమానులు ఆయన మాటే వినకపోతే ఇక ఆయన్ని ప్రజలెలా నమ్ముతారు అంటున్నారు.. అయితే ఈ విషయంపై పవన్ అభిమానులు వేరేలా స్పందిస్తున్నారు.. పవన్ ని నిజంగా అభిమానించే వాళ్ళు అలా చేయరు, కావాలనే కొందరు పవన్ పేరుని చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారు అంటున్నారు.. పాపం కొందరి మూలంగా పవన్ కి, పవన్ ని నిజంగా అభిమానించే వాళ్ళకి చెడ్డపేరు వస్తుంది.