కేంద్రానికి హజారే హుకుం
Published on: Sun Dec 18, 2011 12:03PM
న్యూ
ఢిల్లీ: ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టలేకపోతే కేంద్రంలోని యూపీఏ సర్కారు గద్దె దిగాలని అవినీతి వ్యతిరేక ఉద్యమకర్త అన్నా హజారే కేంద్రానికి హుకుం జారీ చేశారు. బెంగుళూరులో జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగింపు దశకు చేరుతున్న తురణంలో లోక్పాల్ బిల్లును ప్రవేశపెడుతున్నారా? లేదా? అంటూ నిలదీశారు. ఈనెల 23వ తేదీలోపు ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టకపోతే మళ్లీ నిరాహార దీక్షకు దిగుతానని, జనవరి 1వ తేదీ నుంచి జైల్భరోకు పిలుపు ఇస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కూ లేఖ రాసినట్టు చెప్పారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ప్రభావవంతమైన లోక్పాల్ బిల్లును పార్లమెంట్ ఆమోదించని పక్షంలో ఈ నెల 27వ తేదీ నుంచి మళ్లీ నిరాహారదీక్షకు దిగుతానని తెలిపారు.


