భార్య ఎన్నికల ఖర్చు కోసం దొంగగా మారిన భర్త.!!

ఎన్నికలు బాగా కాస్ట్ లీ అయిపోయాయి.. ఎన్నికల్లో గెలవడానికి ఖర్చు చేయాలి.. గెలిచిన తరువాత అవినీతి చేసి, ఖర్చు చేసిన దానికి పదిరెట్లు సంపాదించాలి.. ఇదే ఇప్పటి చాలామంది పొలిటీషన్స్ ఫార్ములా.. కానీ ఇప్పుడొక కొత్త ఫార్ములా బయటికొచ్చింది.. అదేంటంటే భార్య ఎన్నికల ఖర్చు కోసం ఓ వ్యక్తి దొంగగా మారాడు.. యూపీలోని ప్రతాప్‌ఘడ్ జిల్లా లాల్‌గంజ్ బ్లాక్‌లోని మద్వా గ్రామానికి చెందిన పంచ్‌లాల్‌వర్మ, సంగీతావర్మలు భార్యాభర్తలు.. భార్య సంగీతావర్మ మద్వా గ్రామ ప్రధాన్ గా పోటీ చేసి విజయం సాధించింది.. ఎన్నికల ఖర్చు కోసం తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర సుమారు 25 లక్షలు అప్పు చేసారు.. ఎన్నికల్లో గెలిచాక భార్య ప్రజాసేవ మొదలుపెట్టిందో లేదో తెలీదు కానీ, గెలవడానికి చేసిన అప్పుని తీర్చడానికి భర్త దొంగతనాలు మొదలుపెట్టాడు.. ఫ్రెండ్స్ తో కలిసి ముఠాగా ఏర్పడి మూడేళ్ళలో సుమారు 65 దోపిడీలకు పాల్పడ్డాడు.. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.