రీనా.. మళ్లీ వచ్చిందోచ్.. ఈసారి మరింత కసక్..
Published on: Wed Feb 23, 2022 1:49PM
రీనా ద్వివేది. కొంతమందికి గుర్తే ఉంటుంది. 2019 యూపీ ఎలక్షన్స్ టైమ్‌లో ఆమె ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. పసుపు రంగు చీరలో.. కత్తిలాంటి ఫిగర్‌తో.. చేతిలో ఈవీఎమ్ బాక్సుతో ఉన్న రీనా ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్.
రీనా ద్వివేది.. యూపీ ప్రభుత్వ ఉద్యోగి. ఆమెకు పోల్ ఆఫీసర్‌గా ఎలక్షన్ డ్యూటీ పడింది. అందులో భాగంగా.. ఎల్లో సారీతో.. కూలింగ్ గ్లాసెస్‌తో.. బ్యూటిఫుల్ లుక్స్‌తో ఉన్న రీనా ఫోటోలు చూసి.. నెటిజన్లు అంతా ఫిదా అయ్యారు. ఎవరీ ఫిగర్.. మోడలా? యాక్టరా? అంటూ ఆరా తీశారు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అని తెలిసి ఆశ్చర్యపోయారు. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్లో జాబ్ చేస్తున్నారామె. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలకు ఫాలోయర్స్ ఫుల్‌గా పెరిగారు. ఆమె రీల్స్, షార్ట్స్‌కు తెగ క్రేజ్ వచ్చింది.
యూపీలో లేటెస్ట్‌గా జరుగుతున్న ఎలక్షన్స్‌లో.. లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియాలోని పోలింగ్ స్టేషన్‌లో.. మళ్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు రీనా ద్వివేది. ఆమెను చూడగానే వెంటనే గుర్తుపట్టేశారు. ఆమె ఫోటోలు మళ్లీ వైరల్ అయ్యాయి. అప్పట్లో పసుపు చీరతో మతిపోగొట్టిన ఆమె.. ఈసారి మోడ్రన్ డ్రెస్‌లో మెరిసింది. స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్‌తో.. ఫుల్‌లెంత్ పాయింట్‌తో.. సన్‌గ్లాసెస్‌తో కేక పుట్టించింది. ఈసారి కూడా రీనా పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. లైక్స్, కామెంట్స్‌కు లెక్కేలేదు.
తన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్‌ను గుర్తించిన రీనా ద్వివేది.. ఆ తర్వాత నుంచి తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో రెగ్యులర్‌గా ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. రీనా ద్వివేదికి ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అలా అలా తన అందంతో నెటిజన్లను ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. బిగ్ బాస్‌లోనూ పార్టిసిపేట్ చేస్తున్నారంటూ న్యూస్ వచ్చినా అది జరగలేదు. ఇక, తాజా ఫోటోను, గతంలోని చీర లుక్స్‌ను జత చేసి.. రీనా పిక్స్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. అందం చూడతరమా? ఓటు వేయగలమా?.. పోలింగ్ స్టేషన్లో పిచ్చెక్కించేలా ఉన్నావే.. ఓటేయాలా, నిన్ను చూస్తూ ఉండిపోవాలా? అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
also watch: రీనా అందం చూడు.. ఓటు గుద్దు...


