యూపీ మంత్రుల కేటాయింపు..యోగి వద్దే హోంశాఖ..
Published on: Wed Mar 22, 2017 6:08PM

యూపీలో ఈరోజు మంత్రుల శాఖల కేటాయింపు జరిగింది. మంత్రుల శాఖల కేటాయింపులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హోం శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇక తనకు రాష్ట్ర హోం శాఖ కావాలని ఉత్తరప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్య పట్టుబట్టినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు ప్రజా పనుల శాఖ ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం దినేశ్ శర్మకు విద్యాశాఖ కేటాయించారు. ఇక మైనారిటీ వ్యవహారాల శాఖను మొహసిన్ రజాకు, వ్యవసాయ శాఖను సూర్యప్రతాప్ సాహికి, ఆర్థిక శాఖను రాజేశ్ అగర్వాల్‌కు, ఆరోగ్య శాఖను సిద్ధార్థ్‌నాథ్‌కు, మహిళా సంక్షేమ శాఖను స్వాతీ సింగ్‌కు, సెకండరీ ఎడ్యేకేషన్ శాఖను రీటా బహుగుణా జోషికి కేటాయించారు.


