కొత్త ట్విస్ట్.. సీఎంగా యోగి ఆదిత్యనాథ్..
Published on: Sat Mar 18, 2017 5:29PM

యూపీ సీఎం రేసులో ఇప్పటి వరకూ ముగ్గురి పేర్లు ప్రధానంగా వినిపించాయి. కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, మనోజ్ సిన్హా, యూపీ పార్టీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈరోజు భాజపా నేతలు సమావేశంకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. సీఎంగా ఆదిత్యనాథ్నే ఎంపిక చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంతేకాదు మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.


