TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఆ నలుగురికి అగ్నిపరీక్ష! యూపీలో గెలుపెవరిదో? 

Published on: Sun Jan 9, 2022 6:35PM

ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 10 నుంచి  మార్చి 7 వరకు ఏడు విడతల్లో యూపీలో పోలింగ్ నిర్వహిస్తారు. మిగిలిన రాష్ట్రాలలోనూ యూపీతో పాటుగా ఒకటి లేదా రెండు విడతల్లో పోలింగ్ పూర్తవుతుంది.  అయితే, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతునూ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించేది మాత్రం యూపీ ఎన్నికలే ... ఆ తర్వాతనే పంజాబ్, ఇతర రాష్ట్రాలు. ఒక విధంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ఫలితాలకు  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ‘నాడీ పరీక్ష’గా నిలుస్తాయని రాజకీయ విష్లేశకులు భావిస్తున్నారు. అందుకే, 2024 ఫైనల్స్’కు 2022 ఎన్నికలు సెమి ఫైనల్స్ అనే మాట రాజకీయ చర్చల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అందులోనూ యూపీనే కీలకం. 

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి బీజేపీ నేత యోగీ ఆదిత్య నాథ్, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్  (ఎస్పీ) , మాయావతి (బీఎస్పీ),  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రాల రాజకీయ భవిష్యత్’ను  నిర్ణయించే ఎన్నికలుగానూ రాజకీయ పండితులు భావిస్తున్నారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ వ్యవహార శైలి విషయంలో బీజేపీ రాష్ట్ర శాఖలో తీవ్ర వ్యతిరేకత వచ్చినా, ఆయన పార్టీ హై కమాండ్ మీద వత్తిడి తెచ్చి మరీ కుర్చీని కాపాడుకున్నారు. ఎన్నికలకు ముందు యోగీని ముఖ్యమంత్రి పదివి నుంచి తప్పించి, మరో సమర్ధ నాయకునికి అవకాశం బీజేపీ ఇవ్వాలని రాష్ట్ర నాయకులు కేంద్ర నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

అయితే యూగీ ఆదిత్యనాథ్, రాష్ట్ర నాయకుల ఎత్తులను చిత్తు  చేయడమే కాకుండా,  ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితునిగా పేరున్న మాజీ బ్యూరోక్రాట్’ ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా నియమించేందుకు, అధిష్టానం చేసిన ప్రయత్నాలను కూడా సాగానీయ లేదు. కరుడు కట్టిన హిదుత్వవాదిగా ముద్ర పడిన యోగీ ఆదిత్యనాథ్, తమ పరిపాలన కాలంలో రాష్ట్రం పురోగతిలో పరుగులు తీస్తోందని చెప్పుకున్నా, వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని రాజకీయ ప్రత్యర్దులే కాదు, సొంత పార్టీ  నేతలు కూడా పెదవి విరుస్తునారు. ముఖ్యమంగా కొవిడ్ సెకండ్ వేవ్’ ను సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో యోగీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కోవిడ్ మృతుల శవాలు గంగానదిలో తేలిన దృశ్యాలు, ఇప్పటికీ కంటి ముందు కదులు తున్నాయి. భయపెడుతున్నాయి.అలాగే, దళితులపై పెరుగుతున్న  దాడులు, నలుగురు రైతుల మరణానికి కారణం అయిన లఖింపూర్ దుర్ఘటన, అలా అనేక విషయాలు ఆదిత్యనాథ్ నాయకత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయని బీజేపీ నాయకులు కూడా పేర్కొంటున్నారు.అంతే కాదు, ప్రధాని మోడీ వారసుడిగా,తదనంతర ప్రధానిగా కొన్న వర్గాల్లో ప్రచారం జరుగతున్న ఆదిత్యనాథ్ రాజకీయ భవిష్యత్’ను ఈ ఎన్నికలు డిసైడ్ చేస్తాయని, అందుకే ఈ ఎన్నికలు ఆదిత్యనాథ్’కు అగ్ని పరీక్ష కానున్నాయని  రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి ఆదిత్యనాత్’కు మాత్రమే కాదు, మాజీ ముఖ్యమంత్రి సమాజవాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్’కు అగ్ని అగ్నిపరీక్షను మించిన పరీక్షగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ 2012 నుంచి 2017 వరకు యూపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, ‘నాన్న కానుక’ ఆయన ముఖ్యమంత్రి అయ్యారే కానీ, ప్రజామోదంతో ముఖ్యమంత్రి కాలేదు. నిజానికి ఇంతవరకు అఖిలేష్ యాదవ, మండలి నామినేట్ అయ్యారే కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సారి కూడా పోటీ చేయలేదు. మండలి సభ్యుడిగానే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో  అయన సారధ్యంలోనే ఎస్పీ  ఎన్నికల బరిలో దిగింది. కానీ, ఫలితం తిరగబడింది. ఆ ఎన్నికల్లో ఎస్పీ చరిత్రలో ఎరగనంత ఘోరంగా ఒడి పోయింది. రేఅప్తి ఎన్నికల్లోనూ అవే ఫలితాలు వస్తే అఖిలేష్ రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. 

మరో మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినాయకురాలు మాయావతి రాజకీయ భవిష్యత్’తో పాటుగా కాన్షీరాం మానస పుత్రిక బీ’ఎస్’పీ మంగడకు కూడా, ఈ ఎన్నికలు పెద్ద పరీక్షాగా నిలుస్తాయని పరిశీలకులు అంటున్నారు. గత (2017) అసెంబ్లీ ఎన్నికల్లో బీ’ఎస్’పీ 19 స్థానాలు గెలుచుకుంది. అయితే, పార్టీ సీనియర్ నాయకులూ సహా, 16 మంది పార్టీకి దూరమయ్యారు. అందులో కొందరిని మాయావతి పార్టీ నుంచి బహిష్కరిస్తే, ఇంకొందరు పార్టీ వదిలి పోయారు. ఇతర పార్టీలలో చేరారు. మరో వంక ఆమె వ్యూహం ఏమో కానీ, ఆమె పెద్దగా  ఎన్నికల  సన్నహాలు చేస్తున్న దాఖలాలు లేవు.  గత అక్టోబర్ నుంచి ఇంతవకు ఇంటి గడప దాట  లేదు. సోసిల్ మీడియాలో ప్రకటనలు చేయడమే తప్ప, కార్య క్షేత్రంలో కనిపించలేదు. ఈ ఎన్నికలలో బీ’ఎస్’పీ  సింగిల్ డిజిట్ స్థానాలకు పరిమితం అయితే, మాయావతి రాజకీయ భవిష్యత్’తో పాటుగా, బీ’ఎస్’పీ మనుగడ కూడా ప్రశ్నార్ధకం అవుతుందని, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్టీకి గత వైభవం తీసుకు వచ్చేందుకు, నడుంబిగించిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియంకా వాద్రా తోలి సారిగా, పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచార బాధ్యతలు తీసుకుని, చాలా కష్ట పడుతున్నారు. అయితే, ఆమె శ్రమ ఎంత వరకు ఫలిస్తుంది అనేది  ప్రశ్నార్ధకమే అంటున్నారు. అయితే, ప్రియాంక పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని అయితే నింపారు.అయితే, సంస్థాగత స్వరూపం  ఇంచుమించుగా తుడిచి పెట్టుకు పోయిన నేపధ్యంలో ప్రియాంక ప్రయత్నాలు భవిష్యత్’లో ఏమో కానీ, ఈ ఎన్నికలల్లో ఫలితాలు ఇవ్వవనే పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. ఇలా యూపీ అసెంబ్లీ ఎన్నికలు ... 2024 సార్వత్రిక ఎన్నికలకు దిక్సూచిగా నిలవడంతో పాటుగా, యోగీ, అఖిలేష్, మాయ, ప్రియాంకా రాజకీయ భవిష్యత్’ను కూడా డిసైడ్ చేస్తాయనడంలో సందేహం అవసరం లేదు