సీతాదేవి ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ
Published on: Sat Jun 2, 2018 2:52PM

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ దేవ్ గారి ప్రవచనాలు ముగిసాయో లేదో... ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. జర్నలిజం మహాభారత కాలంలోనే మొదలైందనీ, నారదుడు గూగుల్‌ని మించినవాడని చెబుతూ దినేష్ ఇప్పటికే వార్తల్లో నిలిచారు. దానికి తోడు నిన్న మరో వివాదానికి తెరతీశారు. ‘సీతాదేవి మట్టికుండలో పుట్టిందని రామాయణం చెబుతోంది. అంటే రామాయణ కాలం నుంచే కృత్రిమ గర్భధారణ ఉందన్నమాట’ అంటూ చెప్పుకొచ్చారు.


