ఉత్తర్‌ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు
Published on: Sat Jun 2, 2018 3:07PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆ పార్టీ వరుసగా నాలుగు ఉప ఎన్నికలను ఓడిపోయింది. దీంతో సొంత పార్టీలోనే యోగి ఆదిత్యనాధ్‌కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అసమర్థ ప్రభుత్వం వల్లా, పనిచేయని మంత్రుల వల్లా పార్టీ మీద ప్రజలకు నమ్మకం తగ్గిందని ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటాని ఎగరేశారు. ఆదిత్యనాధ్ మోదీ పేరు మీద ముఖ్యమంత్రి అయ్యారే కానీ పాలనలో సమర్థ లేదని ఎద్దేవా చేశారు. ఆయన ఆరెస్సెస్ చేతిలో తోలుబొమ్మలా మారిపోయారని మండిపడ్డారు. శ్యాం ప్రకాష్, సురేంద్ర సింగ్ అనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటుని పార్టీ ఎలా స్వీకరిస్తుందో చూడాలి


