TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇదేదో తమాషా అయిపోయిందే..!

Published on: Fri Nov 24, 2017 11:27AM

 

ఒకటి కాదు రెండు కాదు ఇప్పటివరకూ ఉత్తరప్రదేశ్ లో ఎన్నో రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. గత కొద్ది నెలలనుండి మాత్రం ఈ ప్రమాదాలు మరీ ఎక్కువయిపోయాయి. అందుకే వీటికి బాధ్యత వహిస్తూ.. అప్పట్లో కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు కూడా తన పదవికి రాజీనామా చేశారు కూడా. కానీ మంత్రిగారు రాజీనామా చేసినంత మాత్రాన ప్రమాదాలు ఆగుతాయా...జరుగుతూనే ఉన్నాయి. ఆమధ్య కళింగఉత్కళ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 24మంది చనిపోగా 156 మంది గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే... న్యూఢిల్లీ నుంచి హౌరా వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ అరియా వద్ద పట్టాలు తప్పి ఈ ప్రమాదంలో 74 మందికి పైగా గాయపడ్డారు. ఆ తరువాత అదే యూపీలో హౌరా నుంచి జబల్ పూర్ వెళుతున్న శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. అలాగే ఇప్పుడు తాజా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. యూపీలోని బాందా వద్ద వాస్కోడిగామా - పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని 13 బోగీలు పట్టాలు తప్పాయి.

 

ఉదయం 4 గంటలకు ట్రైన్ పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేశామని పియూష్ గోయల్ తెలిపారు. అంతేకాదు మృతుల కుటంబాలకు రూ.5లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. లక్ష, గాయాలైన వారికి రూ.50 వేలు ఎక్స్‌గ్రేషియాగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చికిత్స పొందుతున్న 9 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

 

 

ఇక్కడివరకూ బాగానే ఉన్నా... అసలు ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం కానీ.. కేంద్ర ప్రభుత్వ కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఏదో తమాషా చూసినట్టు చూస్తున్నారు తప్పా దానికి సరైన పరిష్కార మార్గాలు మార్గం కనిపెట్టడం లేదు. ఏదే ప్రమాదం జరిగినప్పుడు చనిపోయినవారికి నష్టపరిహారం చెల్లిస్తున్నారు. సైలెంట్ అయిపోతున్నారు. పోనీ ప్రజలైనా సమస్యపై పోరాటం చేస్తున్నారా అంటే అదీ లేదు.. ఏదో యూపీలో ఇలాంటి ప్రమాదాలు జరగడం కామనే అన్నట్టు.. అటు రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలు.. కేంద్ర ప్రభుత్వం పిచ్చ లైట్ గా తీసుకుంటున్నారు. మరి వాళ్లు అలా లైట్ గా తీసుకున్నంత కాలం ఇలాంటి ప్రమాదాలు ఆగవు..