పాక్‌కి ధీటైన సమాధానం ఇచ్చిన భారత్

ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్‌ కశ్మీర్‌ అంశాన్ని లేవనెత్తింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి అని... భారత్ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో భారత్ ధీటుగా స్పందించింది. భారత రెండో కార్యదర్శి మిని దేవి కుమమ్‌ ఐరాసలో మాట్లాడుతూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న వాళ్లు చెప్పే పాఠాలు స్థితిలో తాము లేమని... ఉగ్రవాదులను అరికట్టడంలో విఫలమైన పాక్‌, భారత్‌ సరిహద్దులో కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. కశ్మీర్‌ అంశంపై మాట్లాడడానికి ముందు, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను వదిలి వెళ్లాలని సూచించారు. అసలు జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద సమస్య తప్ప మరే ఇతర సమస్యలు లేవని వివరించారు. పాకిస్థాన్ లో టెర్రరిస్టులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని... ఒసామా బిన్‌ లాడెన్‌ను అక్కడే దొరికాడని... ముంబయి దాడుల కీలక సూత్రధారి హఫీజ్‌ సయీద్‌ కూడా పాక్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని... 2008 ముంబయి దాడులు, 2016లో జరిగిన పఠాన్‌కోట్‌, ఉరి దాడుల ఘటనలపై పాక్‌ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.