కేంద్రమంత్రులకు ఎలక్ట్రిక్‌ కార్లు..

 

కేంద్ర మంత్రులకు, పలు కీలక అధికారులకు కేంద్ర ప్రభుత్వం మరో బంపరాఫర్ ఇవ్వనుంది. కేంద్రమంత్రులకు, సీనియర్ బ్యూరోక్రాట్లకు ఎలక్ట్రిక్‌ కార్లను ఇవ్వాలని కేంద్రప్రభుత్వం సిద్దమవుతోంది. ఇంధనం సమస్య ఎక్కువగా మనకు.. ఇంధనం దిగుమతిలో మూడో స్థానంలో ఉన్నాం. అందుకే ఆ కొరతను తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దాదాపు 1000 ఎలక్ట్రిక్‌ కార్లను మంత్రులు, అధికారులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా 400 వరకు ఈవీలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. వచ్చే నవంబరు నాటికి వీటిని అందుబాటులోకి తీసుకురావలని చూస్తుంది. ఈ సందర్భంగా  ఎనర్జీ ఎఫిషియెన్స్ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) ఎండీ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ.. ఒకసారి చార్జింగ్ చేస్తే 120-150 కిలోమీటర్లు ప్రయాణించే వెయ్యి కార్లను కొనుగోలు చేయనున్నామని... ఈవీలు, డ్రైవర్లు, ఇతర నిర్వహణ బాధ్యతలను తామే తీసుకునేలా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. ఈ కార్లవల్ల ప్రభుత్వ ధనం ఆదా అవడంతోపాటు కాలుష్యం కూడా తగ్గుతుందని..  మెయింటెనెన్స్‌ కూడా తక్కువగానే ఉంటుందని తెలిపారు.