TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ రాజీనామా.!

Published on: Sat Jul 25, 2026 7:34AM

కేంద్ర మంత్రి రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా చేశారు.  కేంద్ర రైల్వే, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ   ప్రధాని నరేంద్ర మోడీ    సూచనల మేరకు,   సమర్పించిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం (జులై 24) ఆమోదించారు.  

 రాజస్థాన్   నుంచి రాజ్యసభ కు ప్రాతినిథ్యం వహించిన  రవ్‌నీత్ సింగ్ బిట్టూ రాజ్యసభ పదవీకాలం   జూన్ 21తోనే ముగిసింది. ఆ తర్వాత ఆయనకు   రాజ్యసభ నామినేషన్ దక్కలేదు.  రాజ్యాంగంలోని ఆర్టికల్ 75(5) ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని  వ్యక్తి  ఆరు నెలల కాల పరిమితి మించి  కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు. 

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడైన రవ్‌నీత్ సింగ్ బిట్టూ సుదీర్ఘ కాలం పాటు  కాంగ్రెస్ లో ఉన్నారు.  2024 సార్వత్రిక ఎన్నికలకు   ముందు ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో  పంజాబ్ నుంచి పోటీ ఓటమి పాలైనప్పటికీ  బీజేపీ కేంద్రంలో మంత్రి పదవి కట్టబెట్టింది,  రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పంపింది. 

ఇప్పుడు కూడా రవ్ నీత్ సింగ్ చేత  మోడీ రాజీనామా చేయించడానికి కారణం ఆయనకు పంజాబ్ బాధ్యతలు అప్పగించడానికేనని రాజకీయవర్గాలలోో చర్చ జరుగుతోంది.  పంజాబ్ లో ఇప్పుడు   ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో బీజేపీ విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న కమల దళం..  అక్కడ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంగానే వ్యూహాత్మకంగా బిట్టూ చేత రాజీనామా చేయించిందని అంటున్నారు.  కేంద్ర మంత్రి పదవిని వీడిన బిట్టూ రాబోయే రోజుల్లో పంజాబ్ లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని మీడియాకు వెల్లడించారు. 

rticle 75 Constitution, BJP Punjab Politics, Beant Singh Grandson