TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో కేంద్ర మంత్రి గడ్కరీ.. రూ.5,400 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు

Published on: Mon May 5, 2025 10:33AM

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం (మే 5) తెలంగాణలో పర్యటిస్తున్నారు. ఉదయం హెలికాప్టర్ లో సిరిపూర్ కాగజ్ నగర్ చేరుకున్న ఆయన పలు నేషనల్ హైవే ప్రాజెక్టులను ప్రాంభంభాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం  కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు.  మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఆయన హైదరాబాద్ వివారులోని  కన్హా శాంతివనానికి చేరుకుని అక్కడ మధ్యాహ్నం వరకూ ఉంటారు.

అనంతరం  సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ సందర్శించి ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదున్నర గంటలకు అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభించి.   సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. రాత్రి ఏడు గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హస్తినకు బయలుదేరి వెడతారు.