TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన

Published on: Wed Apr 23, 2025 4:10PM

 

జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.  ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్  కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు. 

పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని, ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాక్ నిప్పులు పోస్తోందని మండిపడ్డారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనన్నారు.ఉగ్రదాడి బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామన్నారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. అన్ని మండలాల్లో బస్తిల్లో ప్రజలు నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి పాల్గోన్నారు.