TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ ‘పుర’ ప్రచారానికి కేంద్ర హోంమంత్రి

Published on: Thu Jan 29, 2026 11:58AM

తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికార పగ్గాలు అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ, అందుకు రాష్ట్రంలో జరగనున్న మునిసిపల్ ఎన్నికలలో సత్తా చాటాలన్న పట్టుదలతో ఉంది.

ఈ నేపథ్యంలోనే మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి జాతీయ స్థాయి నాయకులను రంగంలోనికి దింపుతున్నది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తో పాటు పార్టీ జాతీయ స్థాయి నాయకులు కూడా రానున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. రాష్ట్రంలో మునిసిపల్ ప్రచారంలో భాగంగా మూడు భారీ బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఇక తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కూడా మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 3న   మిర్యాలగూడ,  4న జగిత్యాల, 5నచేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లో సీఎం పర్యటించి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇదిలా ఉండగా, మున్సిపల్ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొదటి రోజు గురువారం (జనవరి 28) 890 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.