ఓటుకు నోటుపై కేంద్రం మౌనం
Published on: Wed Jun 17, 2015 8:54AM
.jpg)
నిన్న రాత్రి డిల్లీలో మీడియాతో మాట్లాడిన హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆంద్ర,తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రేపిన ఓటుకి నోటు వ్యవహారంపై స్పందించడానికి నిరాకరించారు. సెక్షన్: 8తో సహా రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న అన్ని వివాదాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి చూసుకొంటారని చెప్పారు. అంతకు మించి ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అంటే ఈ వ్యవహారంలో కేంద్రంజోక్యం చేసుకోదలచుకాలేదని ఆయన స్పష్టం చేసినట్లుగా భావించవచ్చును.


