జార్ఖాండ్‌లో రాష్ట్రపతి పాలన
Published on: Thu Jan 17, 2013 3:27PM
.jpg)
జార్ఖాండ్‌లో రాష్ట్రపతి పాలనకు కేంద్ర క్యాబినెట్ సిఫారసు చేసింది. రాజకీయ సంక్షోభం నెలకొని రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో కొనసాగే మెజార్టీ లేకపోవడంతో రాష్ట్ర గవర్నర్ సయీద్ అహ్మద్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. అర్జున్ ముండా ప్రభుత్వానికి జేఎంఎం మద్దతు ఉపసంహరించుకోవడంతో ఆ రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డాయి. తన ప్రభుత్వం మైనారిటి లో పడిపోవడంతో అర్జున్ ముండా రాజీనామా చేశారు.


