TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్: ఏపీలో ఐఐటీ, ఏజీ వర్సిటీ

Published on: Thu Jul 10, 2014 11:52AM

 

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరాల జల్లు కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఐఐటీని కూడా మంజూరు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అదేవిధంగా వ్యవసాయం విస్తారంగా వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే ఆంధ్రప్రదేశ్ మీద వరాల జల్లు కురవడం ప్రారంభమైంది.