బడ్జెట్: బాలకృష్ణ హ్యాపీ హ్యాపీ!
Published on: Thu Jul 10, 2014 1:31PM
.jpg)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గానికి తీపి కబురు వుంది. అనంతపురం జిల్లా హిందూపురంలో నేషనల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ప్రత్యేక నిధులతో ఇండస్ట్రియల్ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.


