లోక్‌సభలో మాట్లాడుతుండగా.. ప్రధానికి షాకింగ్ న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో అన్యాయం జరిగిందంటూ.. గత కొద్దిరోజులుగా ఎంపీలు చేస్తోన్న నిరసనలపై ప్రధాని స్పందించారు. సభా మర్యాదలను పాటించాలని.. హుందాగా వ్యవహరించాలని ప్రధాని మోడీ ఏపీ ఎంపీలపై అసహనం వ్యక్తం చేస్తూ.. సుధీర్ఘంగా ప్రసంగించారు. సరిగ్గా ఈ సమయంలో ఆయన చెవిన ఒక వార్తను వేశారు అధికారులు. ప్రధాని భార్య యశోదాబెన్ ప్రయాణిస్తోన్న కారుకు ప్రమాదం జరిగిందనేది ఆ వార్త సారాంశం. కోటాలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని.. రాజస్థాన్ నుంచి గుజరాత్ తిరిగి వస్తుండగా.. కోటా-చిత్తోర్‌ఘర్ జాతీయ రహదారిపై ఆమె కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జవ్వగా.. కారులో ప్రయాణిస్తోన్న ఒక వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు.. యశోదాబెన్‌ తలకు బలమైన గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది.. ఆమెను కారు నుంచి బయటకు తీసి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యశోదా ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అయితే షాక్‌లో ఉన్నారని.. వైద్యులు తెలిపారు.