బడ్జెట్: దూరదర్శన్ ‘కిసాన్ ఛానల్’
Published on: Thu Jul 10, 2014 3:58PM
.jpg)
బడ్జెట్ ప్రసంగంలో రైతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. రైతులకు వ్యవసాయ సంబంధ సమాచారాన్ని నిరంతరం అందించడానికి వీలుగా దూరదర్శన్లో కిసాన్ ఛానెల్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. లోకసభలో 2014-15 ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ మేరకు ప్రకటన చేశారు. దూరదర్శన్ కిసాన్ ఛానల్కోసం రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించినట్లు చెప్పారు. అలాగే కమ్యూనిటీ రేడియో స్టేషన్లు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. అందుకు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని అరుణ్ జైట్లీ తెలిపారు.


