TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బడ్జెట్: కొత్త ఫోన్ కొనుక్కోండి!

Published on: Thu Jul 10, 2014 2:07PM

 

కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గురువారం నాడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో చేసిన కొన్ని ప్రతిపాదనలు యువతరానికి, మధ్యతరగతి మానవులకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ఫోన్ల మీద సుంకాలను తగ్గించడంతో ఫోన్ల ధరలు తగ్గే అవకాశం వుంది. తమ దగ్గర వున్న పాత ఫోన్‌ని పక్కన పెట్టేసి కొత్త ఫోన్ కొనుక్కోవాలని అనుకునేవారికి ఇది శుభ తరుణం. అలాగే టీవీల్లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల రేట్లు కూడా తగ్గుముఖం పట్టబోతున్నాయి. ఎప్పటి నుంచో పాత టీవీ మార్చేసి కొత్త ఎల్సీడీ టీవీ కొనాలని అనుకుంటున్న వారికి ఇది కరెక్ట్ టైమ్.