TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణలో యూనీలీవర్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్లు.. దావోస్ లో రేవంత్ తొలి సక్సెస్

Published on: Tue Jan 21, 2025 3:38PM

ప్రపంచ ఆర్థిక వేదిక వరల్డ్​ ఎకనమిక్​ ఫోరం శిఖరాగ్ర సదస్సులో భాగంగా దావోస్‌లో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి బృందం అక్కడ తెలంగాణ పెవిలి యన్‌ను ప్రారంభించింది. ఈ పెవిలియన్ లో కేంద్ర మంత్రులు చిరాగ్ పశ్వాన్, జయంత్ చౌదరిలతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.  తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించారు. అలాగే  పలు అంతర్జాతీయ కంపెనీల సీఈవోలతో  రేవంత్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు భేటీ అయ్యారు.

దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప సక్సెస్ సాధించారని చెప్పవచ్చు. ఈ సదస్సులో భాగంగా రేవంత్ రెడ్డి యూనిలీవర్ సీఈవో హెయిన్ షూమేకర్ తో  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూనీలీవర్ తెలంగాణలో రెండు మేనిఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ఆయనను ఒప్పించారు.  ఇక రాష్ట్రంలో యూనిలీవర్ పెట్టుబడులు వ్యాపార అవకాశాలపై  రేవంత్ రెడ్డి ప్రజంటేషన్ ను కన్విన్స్ అయిన హెయిన్ షూమేకర్ తెలంగాణలో రెండు మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చారు.