రాష్ట్రవ్యాప్తంగా పిడిగుపాటుకు 20 మంది మృతి
Published on: Mon Apr 30, 2012 2:24PM
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం కురిసిన వర్షాలు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. పిడుగులకు రాష్ట్రవ్యాప్తంగా 20 మంది దుర్మరణం పాలయ్యారు.గుంటూరు, ఖమ్మం, ప్రకాశం, వరంగల్ జిల్లాలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గుంటూరులో జిల్లా అత్యధికంగా 11 మంది మృతి చెందారు. ఖమ్మంజిల్లా ఇద్దరు మరణించగా, ప్రకాశం, వరంగల్ ఒక్కొక్కరు మృతి చెందారు.రాష్ర్టంలో అకాల వర్షాలు, పిడుగుపాటు కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు సత్వరమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నిన్న కురిసిన వర్షాలు, పిడుగుపాటుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో సీఎం ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు.


