జైలు పాలైనా వైఫ్‌తో రోమాన్స్ చేస్తోన్న డాన్..

భారతదేశంలో జైళ్లు ఖైదీలకు గెస్ట్‌హౌస్‌లుగా మారిపోయాయని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. డబ్బు, పలుకుబడి ఉంటే చాలు సమస్త సుఖాలు కారాగారాలకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. ఇక మాఫియా డాన్‌ల సంగతి సరేసరి. ఇలాంటి అవకాశాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు మాఫియా డాన్ అబుసలేం. తలోజా జైల్లో ఉన్న అబూసలేంను విచారణ కోసం వేర్వేరు నగరాలకు పోలీసులు తీసుకెళ్తుంటారు. సరిగ్గా ఇదే అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు సలేం. రైల్వేస్టేషన్‌ వెయింటింగ్ రూంలలో తన భార్య సయ్యద్ బహార్ కౌసర్‌ను, ఇతర కుటుంబసభ్యులను కలుసుకుంటున్నాడన్న విషయం వెలుగులోకి వచ్చింది.

 

అబూ సలేంను తాను పెళ్లి చేసుకుంటానని, అందుకు అనుమతి ఇవ్వాలని కౌసర్ గత జూన్‌ నెలలో కోర్టును కోరింది. ఆ మధ్యలో ఒకసారి అతడిని పెళ్లి చేసుకోవడం వల్ల తన జీవితం నాశనం అయ్యిందని మీడియాకు ఎక్కింది. అయితే తాజా ఫోటోలు చూస్తే మాత్రం ఇద్దరూ ఎంచక్కా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భార్యభర్తలిద్దరూ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న ఫోటోలు ప్రజంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండగా..వీరికి ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన పోలీసులకు మాత్రం వెన్నులో వణుకు పుడుతోంది.