ప్రపంచకప్ సాధించిన భారత్...

 

న్యూజిలాండ్‌ వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్ లో భారత్ విజయం సాధించింది. జూనియర్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో వరల్డ్ కప్ ను సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా జట్టు 216 పరుగులు చేయగా, 217 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టు కేవలం రెండు వికెట్లు కోల్పోయి 38.5 ఓవర్లలో 220 పరుగులు సాధించి సగర్వంగా వరల్డ్ కప్ ను సాధించింది. ఇక వరల్డ్ కప్ సాధించి దేశప్రతిష్ఠను కాపాడిన జట్టుకు బీసీసీ భారీ నజరానా ప్రకటించింది. ఒక్కో ఆటగాడికి 30 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు

 

ఇక ఈ సేనకు కోచ్ గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సచిన్ జట్టును అభినందిస్తూ 'శుభాకాంక్షలు ఛాంపియన్స్, దేశాన్ని గర్వించేలా చేశారు. రాహుల్, పరస్ కు శుభాకాంక్షలు' అన్నాడు.  రైనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా... 'అజేయమైన భారత అండర్ 19 ఆటగాళ్లు విజయానికి వందశాతం అర్హులు. ఈ విజయాన్ని ఆస్వాదించండి. కానీ ఇది ఆరంభం మాత్రమేనని గుర్తించండి. జట్టు విజయం వెనుక నిరంతర స్పూర్తిగా నిలిచిన రాహుల్ ద్రవిడ్ కు పెద్ద కేక' అన్నాడు. సెహ్వాగ్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా, వర్ధమాన ఆటగాళ్లు రాహుల్ ద్రవిడ్ వంటి సురక్షితమైన దిగ్గజం చేతుల్లో ఉన్నారని, భవిష్యత్ క్రికెట్ కు అద్భుతమైన ప్రతిభగల క్రీడాకారులు తయారవుతున్నారని పేర్కొన్నాడు.