TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉండవల్లికి శివాజీ వార్నింగ్ .. నన్ను కెలకొద్దు.. అన్నీ బయటపెడతా...

Published on: Sun Mar 25, 2018 1:59PM

 

ఓ జాతీయ పార్టీ 'ఆపరేషన్ ద్రవిడ' చేపట్టిందంటూ హీరో శివాజీ దానికి సంబంధించిన పలు సంచలన విషయాలు బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు నుండి ఇక ఎక్కడ చూసిని దీనిపై ఒకటే చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు దీనిపై స్పందించిన ఉండవల్లి ఎవరో చెప్పిన కథను నమ్మి శివాజీ ఇలా చెప్పి ఉంటారని.. ఇదంతా ఓ జానపథ కథ అని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు...ఉండవల్లి వ్యాఖ్యలపై స్పందించిన శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ లో ఇంటర్వ్యూలో పాల్గొన్న శివాజీని.. మీరు చెప్పింది ఒక జానపద కథలా ఉందని ఉండవల్లి చెప్పారని..మీరేమంటారని అనగా...ఆపరేషన్ గరుడ గురించి తాను వివరాలను వెల్లడిస్తే... ఉండవల్లికి ఉలుకెందుకని ప్రశ్నించారు. గత 10 నుంచి 12 ఏళ్లుగా ఆయనను తాను గమనిస్తున్నానని... ఏ ఇద్దరు కూడా ప్రశాంతంగా ఉండకూడదనేని ఉండవల్లి తత్వమని.. ఏదో ఒక పక్క ఉండి అవతలివారిపై నిందలు వేస్తుంటారని... తద్వారా బెనిఫిట్ పొందుతుంటారని అన్నారు. ఆయన చెబితే భగవద్గీత... మేము చెబితే పిచ్చి మాటలా? అని మండిపడ్డారు. తాను చెప్పింది నమ్మాలని ఉండవల్లిని అడిగానా? అని ఎద్దేవా చేశారు.

 

అంతేకాదు.. తనకు బెనిఫిట్స్ మీద ఆశ ఉంటే... బీజేపీ నుంచి బయటకు వచ్చేవాడినే కాదని.. తనను కెలికితే గతంలో పోలవరం గురించి ఉండవల్లి మాట్లాడినవన్నీ వీడియోలో పెట్టి చూపిస్తానని హెచ్చరించారు. తాను ప్రశాంతంగా రాష్ట్రం కోసం పని చేస్తున్నానని... తనను రెచ్చగొట్టొద్దని చెప్పారు. మరి శివాజీ వార్నింగ్ కు ఉండవల్లి ఎలా స్పందిస్తారో చూద్దాం...