TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకి అండగా ఉండవల్లి..!!

Published on: Thu Jul 5, 2018 6:36PM

 

ఉండవల్లి అరుణ్ కుమార్.. విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నేత.. విభజన అనంతరం కాంగ్రెస్ కి దూరంగా ఉంటూ వస్తున్న ఉండవల్లి, రాజకీయాలకు మాత్రం ఎప్పుడు దగ్గరగానే ఉంటూ వస్తున్నారు.. రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఎప్పటికప్పుడు తనదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు.. తాజాగా ఉండవల్లి, చంద్రబాబుకి ఓ లేఖ రాసారు.. పార్లమెంటు వర్షాకాల సమావేశాలే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చివరివి అని.. తలుపులు మూసి విభజన చేశారన్న మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబడితే.. ఆ అంశంపై పార్లమెంటులో చర్చ జరిగితే కాంగ్రెస్, బీజేపీలలో ఎవరు దోషో తేలిపోతుంది.. కాబట్టి తెలుగుదేశం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఉండవల్లి అన్నారు.. రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదనడానికి తాను ఆధారాలు ఇస్తానని చెప్పిన ఉండవల్లి.. తెలుగుదేశం పార్టీ నోటీసులు ఇవ్వకుంటే తాను ఇతర రాష్ట్రాల పార్టీలకు ఏపీ గోడును వినిపిస్తానని అన్నారు.. 

రాష్ట్రం కోసం ఢిల్లీలో సోలోగా పోరాడే అవకాశం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వచ్చిందని, ఈ అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నానని ఉండవల్లి తెలిపారు.. రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదని నిరూపించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని వాటిని టీడీపీకి ఇస్తానని ఉండవల్లి చెప్పడం చర్చనీయాంశం అయింది.. చంద్రబాబు 'అన్యాయంగా విభజన చేసిందని 'కాంగ్రెస్ ని, 'ప్రత్యేకహోదా ఇవ్వలేదని' బీజేపీని విమర్శిస్తున్నారు.. ఇప్పుడు చంద్రబాబు కి మద్దతుగా అన్నట్టుగా 'రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదని నిరూపించే ఆధారాలు ఇస్తానని, మోడీ ప్రసంగంపై టీడీపీ ఎంపీలు లోకసభలో చర్చకు పట్టుబట్టాలి' అని ఉండవల్లి అనడం ఆశ్చర్యంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.