TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ అధికారంలోకి రావాలంటే.. అది జరగాలి.. ఉండవల్లి

Published on: Mon Apr 6, 2026 2:23PM

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  మరోసారి తన వైసీపీ అనుకూల వైఖరిని బయటపెట్టుకున్నారు. స్వయం ప్రకటిత మేధావి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో ఎవరూ అడగకుండానే చెప్పేశారు.

 రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు. ఇంతకీ ఆయన చెప్పిందేమిటంటే.. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలన్నా, జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలన్నా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విచ్ఛిన్నం కావాలని చెప్పారు. అంటే ఒక రకంగా కూటమిని విచ్ఛిన్నం చేయడమొక్కటే వైసీపీ రాజకీయ ఎజెండా కావాలని ఆయన జగన్ కు ఉద్బోధించారన్న మాట.  వైసీపీ ఉనికి కూటమి విచ్ఛిన్నంపైనే ఉందన్న విషయాన్ని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కూటమి ఐక్యత ఇలాగే ఉంటే.. మరో పది హేనేళ్లు వైసీపీకి అధికారం అందని ద్రాక్షగానే ఉంటుందని హెచ్చరించారు.  

మామూలుగా అయితే ఉండవల్లి ప్రస్తుతం జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదన, ఆ ప్రతిపాదనపై నెటిజనుల ట్రోలింగ్ గురించి మాట్లాడాలి. మావిగన్ ప్రతిపాదనపై తన అభిప్రాయమేంటో చెప్పాలి. అలాగే అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా చట్టబద్ధత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలూ ఆమోదముద్ర వేయడంపై తానేమనుకుంటున్నారన్నది చెప్పాలి. అయితే వాటి ఊసెత్తకుండానే.. వైసీపీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఏం చేయాలో చెప్పారు. కూటమి విచ్ఛిన్నం కావడం కోసం పని చేయాలని జగన్ కు, వైసీపీకి సూచించినట్లుగా ఆయన మాటలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.