TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

వైసీపీలో చేరికపై ఉండవల్లి క్లారిటీ

Published on: Tue May 7, 2019 2:26PM

 

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరబోతున్నారంటూ వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలపై ఉండవల్లి స్పందించారు. తాను వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం సోషల్ మీడియా సృష్టేనని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రజలు నమ్మెుద్దన్నారు. రాజకీయాల నుంచి తాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని, ఇకపై రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకుంటే అది పనిష్మెంట్ లా భావించి రాజకీయాల్లోకి వచ్చేవాడినని కానీ తాను వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నానన్నారు. తనకు ఇలాగే బాగుందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల తప్పులను ఎత్తిచూపుతూ ప్రజలకు అవసరమయ్యే మంచి కోసం మాట్లాడటంపై సంతృప్తి చెందుతున్నానని చెప్పారు. వైసీపీ తనకంటే మేధావులు, రాజకీయ అనుభవజ్ఞులు ఎంతోమంది ఉన్నారని చెప్పుకొచ్చారు. తన అవసరం ఆ పార్టీకి ఉండదన్నారు ఉండవల్లి.