వాళ్లు ఓడిపోవాలి...చంద్రబాబుకు మద్దతిస్తా...!

 

ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కాస్త రాజకీయ అనుభవం ఉన్న ఎవరికైనా ఆయన గురించి తెలిసే ఉంటుంది.  రాజకీయ విశ్లేషణల లో ఆయనది అందెవేసిన చెయ్యి. ఏదైనా విషయం మీద పూర్తిగా అవగాహన వచ్చాకే మాట్లాడడం ఆయన ప్రత్యేకత. ఇక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన.. అప్పుడప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలపై ప్రశ్నిస్తూ.. మీడియా ముందుకు వస్తూ పలు వివరణలు ఇస్తూ ఉన్నారు.  ఏపీకి ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటంలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అదే సమయంలో ఇతర పక్షాల పోరాటం, అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదన్న విషయాలపై ఉండవవల్లి కీలక వ్యాఖ్యలు చేసి ఏపీ రాజకీయాల్లో పెను సంచలనమే రేపారు. ఇక ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో మాత్రం రెగ్యులర్ గా మీడియాతో టచ్ లో అప్పుడప్పుడు అధికార పార్టీపై పంచులు వేస్తూనే.. కావాల్సిన సలహాలు ఇస్తున్నారు.

 

ఓ రకంగా ఏపీ ప్రత్యేక హోదా పోరాటం ఇంత సీరియస్ అయిందంటే ఓ రకంగా దానికి ఉండవల్లే కారణమని చెప్పొచ్చు. ఎందుకంటే.. కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టమని అసలు ముందు చెప్పిందే ఉండవల్లి. ఉండవల్లి మాట వినే పవన్ ఆ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి.. అవిశ్వాస తీర్మానం పెట్టాలని సవాల్ విసిరారు. ఇక సవాల్ ను స్వీకరించిన జగన్... కేంద్రానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టారు.. ఆతరువాత టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడంతో అసలు యుద్దం మొదలైంది. దీంతో ఒక్కసారిగా ఏపీ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చాంశనీయమ్యాయి. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని ... అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపాలని తమ వాదన వినిపించినా.. చర్చ మాత్రం జరగకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగించేశారు.

 

ఇక ఈ పోరాటం పై కూడా స్పందించిన ఉండవల్లి ముందుగా హోదా కోసం తెలుగుదేశం ఎంపీల పోరాటాన్ని గురించి ప్రస్తావించిన ఆయన దానిని కేవలం నాటకంగా అభివర్ణించారు. ప్రజలను మభ్యపెట్టేందుకే తన పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారని ఉండవల్లి నిప్పులు చెరిగారు. అంతేకాదు ఈ సందర్బంగా ఏపీ ప్రజలకు కూడా కొన్ని సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బాగు పడాలంటే ఒక్క ఎన్నిక చాలని రానున్న ఎన్నికల్లో డబ్బు ఇచ్చిన వాడికి ఓటెయ్యెద్దని ఆయన రాష్ట్ర ప్రజలను కోరారు. డబ్బు ఖర్చు పెట్టినవాడు ఈ ఎన్నికల్లో ఓడిపోయి తీరాలని అప్పుడే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఎన్నికలు అయ్యాక హోదా ఎలా తెస్తారో టిడిపి, వైసీపీలు చెప్పాలని, ఎందుకంటే టిడిపి వైసీపీలు కేంద్రంలో ప్రధాని స్థాయిలో ఉండేవారు కాదు. ఎలా తెస్తారు..? రేపటి ఎన్నికల్లో ఎన్డీయే రావొచ్చు లేదా యుపిఎ రావొచ్చు...20 కోట్లు ఖర్చు పెట్టె వాడు ముందు అవి రికవర్ చేసుకుంటాడా, మనకి సేవ చేస్తాడ అని ఉండవల్లి ప్రశ్నించారు. అదే విధంగా ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి సంబంధించి తనను పిలిస్తే టీడీపీ నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలుపుతానని కూడా ఉండవల్లి అన్నారు. మరి ఉండవల్లి అంతటి వాడే ఇంత ఆఫర్ ఇచ్చి ముందుకు వచ్చారు... మరి టీడీపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటుందా.. లేక.. లైట్ తీసుకుంటుందా చూద్దాం.. చంద్రబాబు ఏం చేస్తారో...