అవసరమైనప్పుడు కలిసి పోతాము ఉండవల్లి
Published on: Fri Feb 10, 2012 1:37PM
హై
దరాబాద్: ఇంత పెద్ద పార్టీలో విభేదాలు సహజమేనని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పార్లమెంటు సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెసు పార్టీని ఉద్దేసించి అన్నారు . అయితే అవసరమైనప్పుడు తాము కలిసి పోతామని అన్నారు. మరోవైపు చేనేత శాఖ మంత్రి ప్రసాద్ కుమార్ కూడా పార్టీలో విభేదాలపై స్పందిస్తూ ఎలాంటి విభేదాలు లేవంటూనే కుటుంబమన్నాక చిన్న చిన్న విభేదాలు సహజమేనని హైదరాబాదులో అన్నారు. రంగారెడ్డి జిల్లాలో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డితో ప్రసాద్ కుమార్‌కు విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ సబితతో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వలనే తనకు మంత్రి పదవి లభించిందని చెప్పారు. శంషాబాద్ మేడ్చల్ శాసనసభ్యుడు లక్ష్మా రెడ్డి ఇచ్చిన తేనీటి విందుకు ఆయన హాజరయ్యారు. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.


