రష్యాపై గెలిచిన ఉక్రెయిన్.. టెన్నిస్ కోర్టులో ఎలినా రివేంజ్..
Published on: Thu Mar 3, 2022 3:15PM
రష్యాపై ఉక్రెయిన్ రివేంజ్ తీర్చుకుంది. యుద్ధరంగంలో హోరాహోరీ పోరు సాగుతుండగా.. టెన్నిస్ కోర్టులోనూ అంతే కసితో పోరు కొనసాగింది. ఓవైపు రష్యా-ఉక్రెయిన్ వార్.. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య టెన్నిస్ మ్యాచ్. మెక్సికో అందుకు వేదికగా నిలిచింది.
టాప్ సీడ్‌గా బరిలో దిగిన ఉక్రెయిన్ స్టార్ ప్లేయర్ ఎలినా స్విటోలినా.. రష్యన్ క్రీడాకారిణి అనస్తాసియా పొటాపోవాను వరుస సెట్లలో ఓడించి.. రెండో రౌండ్‌కు చేరుకుంది.
"ఉక్రెయిన్‌తో నిలబడటానికి మా టెన్నిస్ కమ్యూనిటీని ఏకం చేయడం నా లక్ష్యం. ఎందుకంటే మేము ఉక్రెయిన్‌లో భయంకరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నాం" అని మ్యాచ్ గెలిచిన అనంతరం ఎలినా తెలిపింది. ఈ టోర్నీలో తనకు వచ్చిన ప్రైజ్ మనీని ఉక్రెయిన్ ఆర్మీకి విరాళంగా ఇస్తానని ఎలినా స్విటోలినా ప్రకటించింది.


