బుల్లితెర ఐటెం భామలు
posted on: May 26, 2013 1:30PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ న్యూ మూవీ 'అత్తారింటికి దారేది ’లో ఐటెం సాంగ్ చేయడానికి హాట్ యాంకర్ అనసూయ ఒప్పుకోక పోవడంతో, ఆమె స్థానంలో మరో హాట్ యాంకర్ కి అదృష్టం వరించింది. ఈ సినిమాలో పవన్ సరసన నటించడానికి యాంకర్ ఉదయభానుకు ఛాన్స్ దొరికిందని అంటున్నారు. గత దశాబ్ద కాలం నుండి యాంకర్ గా బుల్లి తెర ప్రేక్షకుల్ని ఉర్రూతలు ఊగిస్తున్న ఉదయభాను ఈ మధ్య తన అందాలను ఒలకబోస్తూ ఒకటి రెండు సినిమాల్లో ఐటెం సాంగుల్లో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల 'జులాయి'లో అల్లుఅర్జున్ సరసన ఐటెం సాంగ్ చేసిన ఉదయభానుకు పవన్ కళ్యాణ్ సరసన అవకాశం రావడంతో ఎగిరిగంతెసిందట. ఇంకేముంది.... ఈ సినిమా పాటలో ఉదయభాను అందాలకు ప్రేక్షకుల మతి పోవడం ఖాయం అంటున్నారు.


.jpg)



