గతంలో ఆత్మహత్యకు యత్నించిన ఉదయ్ కిరణ్
Published on: Tue Jan 7, 2014 3:23PM
.jpg)
ఉదయ్‌కిరణ్ గతంలో కూడా ఆత్మహత్య యత్నించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడయ్యింది. ఉదయ్ ఎడమ చేతి మణికట్టుపై బ్లేడుతో కోసుకున్న పాత గుర్తులున్నట్లు నిపుణులు గుర్తించారు. రాత్రి 10:30 నుంచి 11 మధ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఉస్మానియా ఫోరెన్సిక్ డాక్టర్ అమ్మాణీ తెలిపారు. ఇంకా పోరెన్సిక్ నివేదికను పోలీసులకు అందజేయలేదని వైద్యులు చెప్పారు.మరోవైపు ఉదయ్‌కిరణ్ ఆత్మహత్యపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఉదయ్‌కిరణ్, విషిత కాల్‌డేటాను పోలీసులు తెప్పించి పరిశీలించినట్లు తెలుస్తోంది. విషిత ఫోన్ నుంచే ఎస్ఎంఎస్‌లు వచ్చినట్లు గుర్తించారు. ఆత్మహత్యకు ముందు స్నేహితులతో ఉదయ్ మాట్లాడినట్లు పోలీసులు నిర్దారించారు.


