Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జీవితకి రెండేళ్ళ జైలు శిక్ష
posted on: Nov 24, 2014 1:15PM

నటుడు డాక్టర్ రాజశేఖర్ భార్య, నటి, దర్శకురాలు జీవితా రాజశేఖర్‌కి చెక్ బౌన్స్ కేసులో రెండేళ్ళ జైలుశిక్ష, 25 లక్షల రూపాయల జరిమానాహైదరాబాద్‌లోని ఎర్రమంజిల్ కోర్టు విధించింది. ఈ కేసు విషయంలో జీవితకి గతంలో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ కూడా జారీ అయింది. ‘ఎవడైతే నాకేంటి’ సినిమాకి సంబంధించి నిర్మాత శేఖర్ రెడ్డికి జీవిత 22 లక్షల చెక్ ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అయింది. ఈ విషయాన్ని శేఖర్ రెడ్డి జీవిత దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ జీవిత పట్టించుకోలేదు. దాంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు ఆ కేసులో జీవితా రాజశేఖర్‌కి జరిమానా, జైలుశిక్ష పడింది. ఇదిలా వుంటే జీవితా రాజశేఖర్ మీద మరో 36 లక్షల రూపాయల చెల్లని చెక్కు కేసు కూడా వుందని సమాచారం.






