TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇక భారత రోడ్లపై టూ వీలర్ రైరై!

Published on: Tue Jun 7, 2022 3:34PM

కుర్ర‌కారుకి బైక్ ల పిచ్చి పెరిగిపోతోంది. బైక్ రైడ్ అంటేనే అదో అద్భుతం! ఈ త‌రం యువ‌త ప‌ల్స్‌ బాగా తెలిసిన బిఎండ‌బ్ల్యూ  కేవలం యువత కోస‌మే స‌రికొత్త  హంగుల‌తో   తెస్తోంది  310 ఆర్ ఆర్ బైక్‌. జూన్ 15న మార్కెట్ లోకి రానున్న ఈ బైక్ ఖ‌రీదు రూ.3 ల‌క్ష‌లు. దీని ప్ర‌త్యేక‌త‌ల విష‌యానికి వ‌స్తే, ఈ  బైక్  టివిఎస్ అపాచీ 310తో ప్లాట్‌ఫామ్ షేర్ చేసుకుంటుంది. బిఎం డ‌బ్ల్యూ మోట‌రాడ్‌, టివిఎస్ మోటార్ ఇటీవ‌లే భాగ‌స్వాముల‌య్యాయి. ఈ భాగ‌స్వామ్యం ఆధ్వ‌ర్యం లోనే టివిఎస్ భార‌త‌దేశంలో బిఎండ‌బ్ల్యూ వాహ‌నాల ఉత్ప‌త్తికి  స‌హ‌క‌రిస్తుంది.  

ఇక  డిజైన్ విష‌యానికి వ‌స్తే, బిఎండ‌బ్ల్యూ 310  బైక్  అపాచీ 310 డిజైన్‌లా క‌నిపించ‌వ‌చ్చు. బ్లూటూత్ అను సంధానమ‌యి వుండ‌డం మ‌రో ప్ర‌త్యేక ఆక‌ర్షణ‌. అలాగే డ్యూయ‌ల్ ఛానల్ ఏ బిఎస్ తో ఆక‌ట్టుకుంటుంది.  అన్నింటికీ మించి ఆర్ ఆర్ 310 బైక్‌లు తెలుపు, నీలం రంగుల్లో వుంటుంది.  నీలం రంగు బిఎండ‌బ్ల్యూ సంప్ర‌దాయంగా వున్న‌ద‌న్న‌ది అంద‌రికీ తెలిసిన‌దే. 
ఇంజ‌న్ సంగ‌తి చెప్పాలంటే, ప్ర‌స్తుత బిఎండ‌బ్ల్యూ 310 ఇంజ‌న్ మోడ‌ల్ లానే ఈ కొత్త బైక్ ఇంజ‌న్ వుంటుంది.  

అలాగే 312.2 సిసి సింగిల్ సిలిండ‌ర్‌తో, లిక్విడ్‌కూల్ ఇంజ‌న్ క‌లిగి వుంటుంది. ఈ బైక్‌కి  9700 ఆర్‌పియం వ‌ద్ద 34 పిఎస్‌, అత్య‌ధికంగా 7700 పిఎం వ‌ద్ద 27.3 ఎన్ఎం శ‌క్తి క‌లిగి వుంటుంది. అలాగే 6 స్పీడ్ ట్రాన్స్‌మిష‌న్ యూనిట్ కూడా క‌లిగి వుంటుంది. ఇక వేగంలో చెప్ప‌క్క‌ర్లేదు..గంట‌కు 160 కి.మీ వేగంలో వెళుతుంది. 0 నుంచి 1000 కి.మీ  కేవ‌లం 7.17 సెకండ్ల‌లో  దూసుకెళ్ల‌గ‌ల‌దు.  ఈ స‌రికొత్త హంగుల బైక్  ఖ‌రీదు అపాచి 310 కిమించే వుంటుంది.

అపాచీ 310 ప్ర‌స్తుతం రూ.2.65 ల‌క్ష‌ల‌కు దొరుకుతోంది.  ఇటీవ‌ల బిఎండ‌బ్ల్యూ ఫోర్ వీలర్లు ఊహించ‌ని ప్ర‌మాదాల‌కు గురి అవుతుండ‌డంతో వాటిని వెన‌క్కి తీసు కుని, ఉత్ప‌త్తి ఆపేసి ఎంతో అత్యాధునిక హంగుల‌తో  ఈ  బిఎండ‌బ్ల్యూ బైక్‌ను ఉత్ప‌త్తి సంస్థ అందిస్తు న్న‌ది.   ఈ బైక్ త‌ప్ప‌కుండా దేశంలో యువ‌త‌ను ఆక‌ట్టుకోగ‌ల‌ద‌ని అధికారులు అంటున్నారు.