TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నెల్లూరు లో ఇద్దరు దారుణ హత్య!

Published on: Thu Apr 17, 2025 6:01PM

నెల్లూరు లో  వేరు వేరు సంఘటనల్లో ఇద్దరుు దారుణ హత్యకు గురయ్యారు.   ఈ   నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద  కారు ట్రావెల్ యాజమాని అల్లా బక్షు టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ గ్యాంగ్ మోటార్ బైక్ మీద వేగంగా వచ్చి బక్షు బైకును డీ కొట్టారు. దీంతో బక్షు వాళ్ళను మందలించాడు. మద్యం  మత్తులో ఉన్న వారు భక్షుతో గొడవకు దిగారు. ఆ గొడవ పెరిగి మద్యం మత్తులో ఉన్నవారిలో ఒకడు కత్తితో  బక్షు గుండెలో పొడిచాడు. కుప్పకూలి పడిపోయిన బక్షును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.

అలాగే మరో సంఘటనలో సుల్తాన్ అనే వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు బండరాయి తో కొట్టి చంపారు. ఈ సంఘటన జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద జరిగింది. ఇలా నెల్లూరు నగరం లో వరుసగా హత్యలు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో నెల్లూరులో ఆరుగురు హత్యకు గురయ్యారు. నెల్లూరులో శాంతి భద్రతల పరిస్థితిపై  తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు చంద్రబాబుకు కూడ ఫిర్యాదు చేశారు.