ఎస్ ఎల్ బిసి టన్నెల్ వద్ద మరో రెండు డెడ్ బాడీలు
Published on: Mon Mar 10, 2025 12:43PM
నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద సహాయక చర్యలు ఊపందుకున్నాయి. గత నెల 22న జరిగిన ప్రమాదంలో టన్నెల్ పై కప్పు కూలి 8 మంది గల్లంతైన సంగతి తెలిసిందే. నేటికి 17 రోజులు అయినా సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఆదివారం తొలి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్క్యూ టీమ్, నేడు మరో రెండు మృతదేహాలను ఐడెంటిఫై చేసింది. తొలి మృతదేహాన్ని టన్నెల్ బోరింగ్ మెషీన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ ది గా గుర్తించారు. అతడి మృతదేహం దొరికిన చోటే, మరో ఇద్దరి మృతదేహాలను ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు మృతదేహాలను నేడు వెలికితీయనున్నారు. మట్టిలో 15 అడుగులలోతులో ఉన్న మృత దేహాలను వెలికి తీసే జాగిలాలు ఎస్ ఎల్ బిసి టన్నెల్ కు చేరుకున్నాయి. కేరళ నుంచి ఈ జాగిలాలను రప్పించారు. కడవార్ జాగిలాలు కుళ్లిపోయిన శవాల వాసనను ఇట్టే పసిగడతాయి. కేరళ తిరువనంతపురంలో మూడు జాగిలాలతో ప్రారంభమైన కడావార్ డాగ్ స్క్వాడ్ ప్రస్తుతం 82కు చేరుకున్నాయి. కుళ్లిన మానవ అవశేషాలను ఇవి ఇట్టే పసిగడతాయి.


