TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరబిందో ఫార్మా ఎండీ అరెస్టు

Published on: Thu Nov 10, 2022 9:34AM

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ స్కామ్ కు సంబంధించి  మరో ఇద్దరికి ఈడీ అరెస్టు చేసింది. తెలుగు రాష్ట్రాలలో ఈ అరెస్టులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈడీ అరెస్టు చేసిన ఇద్దరూ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే. వీరిలో ఒకరు అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్రారెడ్డిని వినయ్ కుమార్ ను ఈడీ అదుపులోనికి తీసుకుంది.

వీరిరువురినీ  ఢిల్లీలో రెండు రోజుల పాటు విచారించి ఆ తరువాత అరెస్టు చేసినట్లుప్రకటించింది. అరబిందో శరత్ చంద్రారెడ్డి, వినయ్ కుమార్ లకు కోట్లాది రూపాయల మద్యం వ్యాపారాలతో సంబంధాలున్నాయని ఈడీ పేర్కొంది.

ఢిల్లీ మద్యం పాలసీకి అనుగుణంగా అరబిందో శరత్ చంద్రారెడ్డి చెల్లింపులు చేసినట్లు అభియోగాలున్నాయని పేర్కొంది. రానున్నరోజులలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు.