TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో ఇద్దరు న్యాయమూర్తులు ? 

Published on: Wed Jan 29, 2025 11:42AM

గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసి తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఇప్పటి వరకు  సినీతారలు, రాజకీయ నాయకులు, స్వంత పార్టీ నేతల ఫోన్లు ట్యాప్ చేసిన బిఆర్ ఎస్ ఒక అడుగు ముందుకేసి ఇద్దరు న్యాయమూర్తుల  ఫోన్ లను ట్యాపింగ్  చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఒక మహిళా న్యాయమూర్తి కూడా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడమే చట్ట విరుద్దం. అటువంటిది  రాజ్యాంగాన్ని , చట్టాలను పరిరక్షించే న్యాయమూర్తుల ఫోన్లను బిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందో తేలాల్సి ఉంది. 
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి ఫోన్ సైతం ట్యాపింగ్ అయినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించిన ఘటన మరువక ముందే తెలంగాణకు చెందిన ఇద్దరు న్యాయమూర్తుల ఫోన్లను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్  చేసింది. 
ఎస్ బి ఐ మాజీ ఓ ఎస్డీ ప్రభాకర్ నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ ఇచ్చిన నివేదికలో  ఇద్దరు న్యాయమూర్తులు  ప్రొఫైళ్లు బయటపడ్డాయి.  ఈ నివేదిక ప్రస్తుతం హైద్రాబాద్ పోలీసుల చేతికి చిక్కింది. వారి వ్యక్తిగత,  కెరీర్ కు సంబంధించిన వివరాలు ఈ ప్రొఫైళ్లలో ఉన్నాయి. అంతే కాదు న్యాయమూర్తుల వాయిస్ రికార్డు అయ్యిందని దర్యాప్తు అధికారులు తేల్చారు.  ఏకంగా న్యాయమూర్తులనే బ్లాక్ మెయిల్ చేసే ఉద్దేశ్యంతో వారి ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు సమాచారం.  నిందితుల వాంగ్మూలాల్లో ఇద్దరు న్యాయమూర్తుల  ప్రస్తావన వచ్చింది.  పోలీసులకు చిక్కిన నివేదికలో వందలాది మంది ప్రొఫైళ్లు ఉన్నాయి.