TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అక్కాచెల్లెళ్ళ ఆత్మహత్య

Published on: Mon Sep 22, 2014 12:20PM

 

హైదరాబాద్‌లో భవాని (17), శ్రుతి (13) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుని మరణించారు. అన్నదమ్ముల పిల్లలైన వీరిద్దరూ వరుసకు అక్కాచెల్లెళ్ళు. వీరిలో భవాని బ్యూటీషియన్‌గా పనిచేస్తుండగా, శ్రుతి హైదరాబాద్ నగరాన్ని చూడటానికి వచ్చింది. ఆదివారం నాడు వీరిద్దరూ ఒకే చీరతో దూలానికి ఉరి వేసుకుని మరణించారు. ఘటనా స్థలంలో తమ చావుకు ఎవరూ బాధ్యులు కారనే సూసైడ్ నోట్ కూడా వుంది. వీరిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్నది ఇంకా వెల్లడి కాలేదు.