TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఇద్దరు అమ్మాయిలకు ఉరి...

Published on: Fri Sep 5, 2014 6:03PM

 

ఇద్దరు స్నేహితురాళ్ళు ఒకేసారి చెట్టుకు ఉరి వేసి వుండగా కనిపించారు. అస్సాంలో ఈ ఘోరం జరిగింది. అస్సాంలోని నీలం బజారు ప్రాంతానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు 9, 10 తరగతులు చదువుతున్నారు. వీరిద్దరూ మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయారు. వీరికోసం కుటుంబ సభ్యులు వెతికి చివరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. వీరిని వెతుకుతున్న క్రమంలో ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఒక చెట్టుకు వీరిద్దరి శవాలు వేలాడుతూ కనిపించాయి. వీరిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారా లేక హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా అనేది ఇంకా బయటపడలేదు.