TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గోదాట్లో  పడవ మునిగి ఇద్దరు మృతి

Published on: Tue Mar 4, 2025 12:13PM

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి పుష్కర్ ఘాట్ లో  పడవ మునిగిన ఘటనలో ఇద్దరు  వ్యక్తులు మృత్యువాత పడ్డారు.  పడవకు కన్నం పడటం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసుల  ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 20 మంది పడవలో లంకకు బయలు దేరి  వెళ్లారు. వారిలో కొందరు తిరిగి వస్తుండగా పడవలో నీరు చేరి  బోల్తా పడింది. పడవలోకి నీరు చేరడం వల్లే ఘటన జరిగినట్టు పోలీసులు చెబుతున్నప్పటికీ ఈ ఘటనలో కుట్ర కోణం ఉందని మరో వాదన వినిపిస్తోంది.  చనిపోయిన వారిలో అన్నవరం, రాజు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.