అమితాబ్ ఫాలోయర్లు.. అక్షరాలా కోటి...
Published on: Sat Sep 6, 2014 4:59PM

సోషల్ మీడియా ద్వారా అభిమానులు ఇప్పుడు తమ అభిమాన తారలతో నిరంతరం ‘టచ్’లో వుంటున్నారు. స్టార్లు కూడా తమ అభిమానులకు నిరంతరం తమకు సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నారు. అలా సోషల్ మీడియా ఒక మంచి వారధిలా నిలుస్తోంది. ఇదిలా వుంటే బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్లో మహా యాక్టివ్. ఆయనకు జ్వరం వచ్చినా కూడా ఆ విషయాన్ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంటూ వుంటారు. ఇప్పుడు అమితాబ్‌ను ట్విట్టర్లో పాలో అయ్యే వారి సంఖ్య అక్షరాలా కోటిని దాటింది. దాంతో ఆయన తన ఫాలోయర్స్ సంఖ్యను సూచిస్తూ కవర్ పేజీ మీద కూడా కోటి సంఖ్య పెట్టారు.


