TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కరీంనగర్ జ్యూవెలరీ షాపు దోపీడీ కేసులో ట్విస్ట్

Published on: Thu May 7, 2026 2:35PM

 

కరీంనగర్ పీఎంజే జ్యువలరీ షాప్ లో దోపిడీ చేసిన కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడి దొంగలు ముందుగా జ్యువెలరీ షాప్ పై రెక్కి నిర్వహించడమే కాకుండా పోలీసుల చేతికి చిక్కకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు... దొంగతనం చేసిన అనంతరం ఈ దుండగులు బైక్‌ను గోదావరి తీరంలో వదిలివేసి వెళ్లారు... అయితే ఇప్పుడు ఆ ద్విచక్ర వాహనం నెంబర్ ప్లేట్ పై పోలీసులు ఆరా తీయడంతో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి... దుండగులు వాడిన ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేట్ హైదరాబాదుకు చెందినదిగా గుర్తించిన పోలీసులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. 

అనంతరం కరీంనగర్ పోలీసులు, హైదరాబాద్ పోలీసులను సంప్రదించారు... దీంతో హైదరాబాద్‌కు చెందిన మొబైల్ షాప్ వ్యాపారిని పోలీసులు విచారణకు పిలిపించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీసులు కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.. పోలీసుల విచారణలో ఆ వ్యాపారి తన TVS మోటార్ కంపెనీ తయారు చేసిన అపాచీ బైక్‌ను అమ్మేం దుకు ఇటీవల OLX లో ప్రకటన ఇచ్చినట్లు తెలిసింది. 

అదే ప్రకటనలో ఉన్న వాహనం నెంబర్‌ను దుండగులు గుర్తు పెట్టుకుని, తమ బైక్‌కు అదే నెంబర్ ప్లేట్ అమర్చి పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. దుండగులకు ఆ నెంబర్ ఎలా తెలిసింది? ప్రకటనను చూసి ముందుగానే ప్రణాళిక వేసుకున్నారా? అనే కోణాల్లో పోలీసులు విచారణను మరింత వేగవంతం చేశారు.ఈ కేసులో మరిన్ని కీలక వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు తెలిపారు.