TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విష గుళికలు తిని 20 జింకలు మృతి

Published on: Wed Aug 13, 2014 1:43PM

 

మన దేశంలో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వన్యప్రాణులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ఒకపక్క అడవులు తగ్గిపోతూ వుండటంతోపాటు వన్యప్రాణులను వేటాడేవారు చట్టానికి దొరక్కపోవడం కూడా వన్యప్రాణులు తగ్గిపోతూ వున్నాయి. ఇలాంటి అనేక కారణాతోపాటు రైతులు పొలాల్లో వుంచుతున్న విష పదార్ధాలను తినడం వల్ల కూడా వన్యప్రాణులు భారీ సంఖ్యలో చనిపోతున్నాయి. మొన్నామధ్య తెలంగాణ రాష్ట్రంలో ఒక పొలంలో జల్లిన పురుగుమందులు కలిపిన ఆహారం తినడం వల్ల ఒకేసారి దాదాపు 40 నెమళ్ళు చనిపోయాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని తిప్పాయిపల్లి దగ్గర ఒక మొక్కజొన్న పంటలో వుంచిన విషపు గుళికలు తినడం వల్ల 20 జింకలు మరణించాయి. విషపు గుళికలు తినడం వల్ల 20 జింకలూ వెంటనే అక్కడికక్కడే మరణించాయి. దాంతో పొలంలో ఎక్కడ చూసినా జింకల కళేబరాలే కనిపిస్తున్నాయి. సాధారణంగా మొక్కజొన్న పంటని అడవిపందులు కబళిస్తూ వుంటాయి. రాత్రికిరాత్రే మొక్కజొన్న పంటని నేలమట్టం చేస్తూ వుంటాయి. అడవిపందులను చంపడానికి పెట్టిన విషపు గుళికలను జింకలు తినడంతో అవి మరణించాయి.