TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశ్వాస పరీక్షలో గెలిచిన దళపతి విజయ్

Published on: Wed May 13, 2026 12:33PM

 తమిళనాడు  అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం బలపరీక్షలో గెలిచింది. బుధవారం బుధవారం  అసెంబ్లీలో జరిగిన  విశ్వాస పరీక్షలో  ద‌ళపతి విజయ్ నేతృత్వంలోని  టీవీకే ప్రభుత్వం సునాయాసంగా గట్టెక్కింది. ఈ బలపరీక్షలో విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా 144 మంది శాసనసభ్యులు మద్దతు పలకగా.. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో ఐదుగురు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.  ఇటీవలి ఎన్నికల్లో   విజయం సాధించి అధికార పీఠం దక్కించుకున్న విజయ్.. ఈ విశ్వాస పరీక్షలో గెలిచి  నిలబె ట్టుకున్నారు.

అయితే, ఈ ఓటింగ్‌కు ముందు ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే తన 59 మంది ఎమ్మెల్యేలతో సభ నుంచి వాకౌట్ చేసింది. ఇక..  మూడో అతిపెద్ద పార్టీ అయిన అన్నాడీఎంకే  ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించినప్పటికీ,   ఆ పార్టీకి చెందిన పాతిక మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో  దీంతో  తమిళ  రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన అన్నాడీఎంకే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయినట్లైంది. అన్నా డీఎంకేలో  పళనిస్వామి వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఈ తిరుగుబాటుతో పళనిస్వామికి రాజకీయంగా గట్టి రాజకీయ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఇక పోతే విశ్వాస పరీక్ష తరువాత మీడియాతో మాట్లాడిన సీఎం విజయ్... విజిల్ చరిత్రను మార్చిందన్నారు.  తమది మైనారిటీ ప్రభుత్వం అని చెబుతూనే..   మైనార్టీల హక్కులను కాపాడే ప్రభుత్వమన్నారు.