TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తమిళనాట టీవీకే దూకుడు

Published on: Mon May 4, 2026 9:39AM

నాలుగు రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీలకు గత నెలలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమ బెంగాల్  అసెంబ్లీలో మొత్తం 294 స్థానాలు ఉండగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటూ 148 స్థానాలలో విజయం సాధించాలి. ఇక తమిళనాట 234 స్థానాలు ఉండగా ఇక్కడ అధికారం చేజిక్కుంచుకోవాలంటే 118 స్థానాలలో విజయం సాధించాల్సి ఉంటుంది. అలాగే కేరళలలో మొత్తం స్థానాలు 140 కాగా,  మ్యాజిక్ ఫిగర్  71 స్థానాలు. ఇక అసోంలో మొత్తం స్థానాలు 126 కాగా ఇక్కడ అధికారానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 64. పుదుచ్చేరిలో మొత్తం స్థానాలు 30 కాగా ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16.  

ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తమిళనాట టీవీకే మ్యాజిక్ ఫిగర్ స్థానాలు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పశ్చిమ బెంగాల్ లో బీజేపీ 125 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, తృణమూల్ కాంగ్రెస్ 119 స్థానాలలో ముందంజలో ఉంది. 

ఇక తమిళనాట టీవీకే ఆధిక్యత రాజకీయ పరిశీలకులను సైతం విస్మయపరుస్తోంది. నటుడు విజయ్ టీవీకే పార్టీ ఆధిక్యతలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న సమాచారం మేరకు టీవీకే పార్టీ 90 స్థానాలలో ఆధిక్యత కనబరుస్తుండగా, అధికార డీఎంకే 50 స్థానాలలోనూ, అన్నాడీఎంకే 56 స్థానాలలోనూ ఆధిక్యతలో ఉన్నాయి. ఒక అంచనా మేరకు విజయ్ టీవీకే పార్టీ పాతిక శాతంపైగా ఓట్ షేర్ తో స్పష్టమైన ఆధిక్యతతో దూసుకుపోతున్నది.